టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నయనతార గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈమె కనెక్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాలో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది ఈమె. నయనతార ఇప్పటికే చాలా సినిమాలలో నటించిన జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమంలో మాత్రం ఎప్పుడూ పాల్గొనలేదు. ఇక శ్రీరామరాజ్యం సినిమా తరువాత మళ్లీ నయనతార కనెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.గత కొంతకాలంగా నయనతారపై అనేక రకమైన రూమర్లు వస్తున్నాయి.
ఇప్పుడు అలాంటి వార్తలన్నిటికీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఫుల్ స్టాప్ పెట్టింది నయనతార. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా నయనతార కొద్ది రోజుల క్రితం నుండి హీరోయిన్ మాళవిక మోహన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చింది నయనతార. ఇక వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే గతంలో మాళవిక మోహన్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా ఒక స్టార్ హీరోయిన్ యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్న సన్నివేశంలో నటించడానికి కూడా మేకప్ వేసుకొని ఎలా నటిస్తారో నాకు అసలు అర్థం కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు దానిపై స్పందించింది నయనతార.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాళవిక మోహన్ ఇంటర్వ్యూ నీ నేను కూడా చూశాను. తను నా పేరు తీయకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఆమె ఆ మాటలు నా గురించి అన్నది అన్న విషయం నాకు తెలుసు. ఆమె చెప్పింది కరెక్టే ఆ సన్నివేశంలో నేను మేకప్ వేసుకుని నటించాను. ఆ ఒక్క పాత్ర డిమాండ్ చేయడం వల్లే నేను అలా చేయాల్సి వచ్చింది. నేను మేకప్ లేకుండా అలాంటి పాత్రలో నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సన్నివేశంలో నేను అలా కనిపించాలి కాబట్టి అలా నటించాను. అంతేకాదు ఆ సన్నివేశం కోసం నేను జుట్టు చెరుపుకుంటే డైరెక్టర్ వద్దు అని అన్నాడు .అలాంటి సందర్భంలో మనం ఏం చేయగలం అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఎవరైనా సరే దర్శకులు చెప్పినట్లుగా నడుచుకోవడమే తమ బాధ్యత.. కమర్షియల్ సినిమాల కోసం వాళ్లు ఎలా నటించాలి అంటే మనం అలా నటించక తప్పదు అని చెప్పుకొచ్చిందినయనతార. మరి నయనతార స్పందించిన విధానానికి మాళవిక మోహన్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి..!!