"ఎన్టీఆర్ 30" వ మూవీకి ముహూర్తం పిక్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో నటించి తన నటనతో ... డ్యాన్స్ తో ... డైలాగ్ డెలివరీతో ... మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. 
ఏది ఇలా ఉంటే ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" మూవీతో ప్రేక్షకులను పలకరించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రావడం మాత్రమే కాకుండా ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నట్లు , రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీలో జాహ్నవి కపూర్ , ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే గతంలో చాలా సార్లు ఈ మూవీ షూటింగ్ అప్పుడు ప్రారంభం కాబోతుంది ... ఇప్పుడు ప్రారంభం కాబోతోంది అని వార్తలు వచ్చినప్పటికీ ఈ మూవీ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి కి ఈ మూవీని మొదలుపెట్టడానికి మూవీ యూనిట్ పక్కాగా పిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీపై తెలుగు సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా  ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: