బాలయ్య వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఆంధ్రాలో ఎక్కడంటే..?

Divya
నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా ఈయన తన జోరు పెంచి ఒకవైపు సినిమాలు.. మరొకవైపు షోలు ఇంకొక వైపు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ చేజేతుల బాగా సంపాదిస్తున్నారు. మరొకవైపు రాజకీయాలలో కూడా తన వంతు స్థానంలో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. అయితే లేటు వయసులో కూడా ఇంత ఎనర్జీ ఆయనలో ఎక్కడి నుంచి వచ్చిందని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. బయటకు గంభీరంగా కనిపించే నట సింహం బాలకృష్ణ లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు అని ఇప్పటికే ఆయనతో కలిసి నటించిన ఎంతోమంది తెలియజేశారు.

ఇదిలా ఉండగా అఖంద సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో నిర్వహించాలని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ప్రకటించలేదు.  కానీ ఒంగోలులో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అంటే అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణ రెండింటిలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వాహకులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్  ఒంగోలులో నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన  సుగుణసుందరీ, జై బాలయ్య వంటి పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  మరి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: