హ్యాపీ బర్తడే: తమన్నా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Divya
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా ఈమె క్రేజ్ ఎక్కడ తగ్గలేదు అంటే ఈమెకు ఇండస్ట్రీలో అభిమానులు ఏ సంఖ్యలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తెలుగు , తమిళ్, కన్నడ , హిందీ భాషా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తమన్నా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా పూర్తి పేరు తమన్నా భాటియా.. కేవలం తెలుగు సినిమాలోనే కాదు సౌత్ సినిమాల్లో కూడా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నట  కన్నడలో జాగ్వార్,  కే జి ఎఫ్ చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ లో డాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఏ డ్రెస్ వేసుకున్న అందులో గ్లామర్ గానే కాకుండా హాట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. 1989 డిసెంబర్ 21న ముంబైలోని సింది కుటుంబంలో జన్మించిన ఈమె తండ్రి సంతోష్ భాటియా వజ్రాల వ్యాపారి. ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తమన్న 15 సంవత్సరాల వయసులోనే నటించడం ప్రారంభించింది. 2005లో తన 15 ఏళ్ల సంవత్సరాల వయసులో చాంద్ సా రోషన్ చెహర వంటి చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా విజయం అందించలేదు.
అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో.. 2006లో కేడి సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది.  మూడు సినిమాల విఫలమైనప్పటికీ 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్.. బాలాజీ శక్తి వేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి సినిమాలు తమన్నాకు మంచి గుర్తింపు ఇచ్చాయి.  ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది తమన్నా.  మరికొన్ని భారీ ప్రాజెక్టులలో భాగస్వామ్యం అయింది. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: