ప్రభాస్... మారుతి మూవీ విడుదలపై లేటెస్ట్ అప్డేట్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ మరి కొంత కాలంలోనే విడుదల కాబోతోంది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ప్రభాస్ ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది.

ప్రభాస్ సరసన ఈ మూవీ లవ్ నిది అగర్వాల్ ,  మాళవిక మోహన్ ,  రీద్ధి కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా , సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు మారుతి తాంత్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను ఆచార్య మూవీ కోసం వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.

కాకపోతే ఈ మూవీ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ప్రకటించలేదు.  ప్రభాస్ , మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ని 2024 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఉద్దేశంలో మూవీ యూనిట్ ఉన్నట్లు , దాదాపుగా ఈ మూవీ ని 2024 సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: