వామ్మో..సింగర్ సునీత భర్త కి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..!?

Anilkumar
ప్రముఖ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గుంటూరులో పుట్టి పెరిగినప్పటికీ విజయవాడలో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె మొదట టీవీ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా, అసిస్టెంట్ దర్శకురాలిగా దాని తరువాత 15 సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమంలో గాయనిగా తొలి ప్రవేశం చేసింది సునీత. గులాబీ, ఎగిరే పావురమా వంటి సినిమాలలో పాటలు పాడింది ఈమె.దాని అనంతరం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోయిన్లకు వాయిస్ అందించింది .దాదాపు 700 సినిమాలకు పైన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసింది.

అదే సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి రాంగోపాల్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె చేయలేదు. సింగర్ గా ఆమె జీవితాన్ని కొనసాగించింది.అయితే ఇటీవల రెండో వివాహం చేసుకుంది సునీత. ప్రముఖ మీడియా వ్యాపారవేత్త అయిన మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకుంది సునీత. వెరీ లేట్ వివాహం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది అన్న సంగతి.సునీత వివాహం చేసుకున్న వ్యక్తి పూర్తి పేరు రామకృష్ణ వీరప్పనేని ఆయన ఆస్ట్రేలియాలో పై చదువులు చదివి భారతదేశానికి వచ్చి వ్యాపారవేత్తగా పెరిగారు రామ్ వీరపనేని ప్రముఖ కంపెనీలో కొన్ని వందల కోట్ల రూపాయలు

విలువ చేసే స్టేర్లను ఉన్నాయని... మ్యాంగో మ్యూజిక్ కి సునీత ఎన్నో పాటలు పాడారని అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి దాని అనంతరం దంపతులుగా మారారు. ఇక మొదటి నుండి సోషల్ మీడియాకి రామ్ వీరపనేని దూరంగానే ఉన్నారు. అయితే యూట్యూబ్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న మ్యాంగో మ్యూజిక్ కి ఈయన సీఈఓ తమిళం హిందీలో బ్లాక్ బస్టర్ సినిమాలో రైట్స్ తీసుకుని యూట్యూబ్లో పెట్టేవాడు.ఈ బిజినెస్ ద్వారానే కొన్ని వందల కోట్లను సంపాదించాడు రామ్ వీరపనేని. హైదరాబాదులో పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో పాటు అపార్ట్మెంట్స్ కూడా ఈయనకు ఉన్నాయని వాటితో పాటు ఆయన తండ్రి వారసత్వంగా కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా ఈయన పేరున ఉన్నాయని తెలుస్తోంది. దీంతో సింగర్ సునీత రెండవ భర్త ఆస్తుల వివరాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: