కిరణ్ అబ్బవరం మూవీ నుంచి మొదటి పాట రిలీజ్ డేట్ ఫిక్స్..!

Divya
ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో అచ్చం పక్కింటి వాడిలా ఉన్నాడు అంటూ పలువురు ఈయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని .. సెబాస్టియన్ పీ. సీ. 524 వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా.. కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా మురళీ శర్మ , శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 5 నెలల క్రితం ఈ సినిమా నుంచి అఫీషియల్ టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్... ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు నా... మా జీవితాలన్నీ ఏడుకొండల చుట్టూ  తిరుగుతా వుంటాయి.  మాది తిరుపతి..నాపేరు విష్ణు.. అంటూ సాగే ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేయబోతున్నారు.  వచ్చే యేడాది ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం.  ఏది ఏమైనా విభిన్న కథలను ఎంచుకునే కిరణ్ అబ్బవరం ఈసారి కూడా ఒక యాక్షన్ మూవీ తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: