వారాంతంలో రికార్డు బ్రేక్ చేసిన అవతార్ 2 ..!

Divya
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన అవతార్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్.. పేరిట భారీ విజువల్ వండర్ చిత్రాన్ని డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య ఏకంగా రూ.2900 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రతి ఒక్కరికి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఇండియాలో కేవలం 38 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది.
అయితే హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్  సినిమా మొదటి రోజే రూ. 52 కోట్ల మేర వసూలు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ రికార్డును అవతార్ టు మొదటిరోజు బ్రేక్ చేయలేకపోయింది . దీంతో నిర్మాతలు కూడా కొంచెం నిరాశ వ్యక్తం చేశారు. కానీ రెండవ రోజు ,మూడవ రోజు కూడా వారాంతం హాలిడే కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూడడానికి హాజరయ్యారు. దీంతో ఈ సినిమాకి కలెక్షన్ల పరంగా బాగా కలిసొచ్చింది అని చెప్పాలి.
ఇప్పుడు వారాంతం పూర్తి అయ్యేసరికి అవతార్ 2 సినిమా ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. వారాంతంలో అవతార్ టు సినిమా రూ.157 కోట్లకు పైగా సంపాదించి రికార్డు సృష్టించింది.  ఎవెంజర్స్ ఎండ్ గేమ్ వారాంతంలోకి కేవలం రూ. 129 కోట్లకు పైగా మాత్రమే వసూలు చేసింది. అలాగే నో వే హోం మేడ్ సినిమా వారాంతంలోపు రూ.108 కోట్ల మేర వసూలు చేయగా, మామ్ రూ.79 కోట్ల మేర వసూలు సాధించింది దీన్ని బట్టి చూస్తే అవతార్ 2 ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు.. ఎలాగో క్రిస్మస్ రాబోతోంది కాబట్టి ఈ సినిమా మరింత కలెక్షన్స్ సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: