"18 పేజెస్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించిన నిఖిల్ ఈ సంవత్సరం ఇప్పటికే కార్తికేయ 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టి నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ గా కార్తికేయ 2 మూవీ నిరచింది. చందు మండేటి దర్శకత్వంలో తనకెక్కిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ,  శ్రీనివాస్ రెడ్డి ,  వైవా హర్ష ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

కార్తికేయ 2 మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నిఖిల్ మరి కొన్ని రోజుల్లో 18 పేజీస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ,  గోపి సుందర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్ ,  హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు , ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: