అంజి సినిమా ప్లాప్ అవ్వటానికి కారణం...!!

murali krishna
మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రాలలో అంజి ఒకటి .అప్పట్లోనే రిచ్ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కోడి రామకృష్ణ .
2004 లో విడుదల అయినా బాలకృష్ణ లక్ష్మి నరసింహ ,ప్రభాస్ వర్షం చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా అంజి చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ ముందు చతికిల పడింది .ఈ చిత్ర వైఫల్యం కారణంగా ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆర్ధిక నష్టం ఎదుర్కొన్నారు .ఐతే ఈ సినిమా ఎలా తెరకెక్కింది ,ఈ చిత్ర నిర్మాణానికి ముందు ఎం జరిగింది అని దివంగత కోడిరామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ..
అప్పట్లో చిరంజీవి బి.గోపాల్ తో చేసిన ఇంద్ర, వినాయక్ దర్శకత్వం వహించిన ఠాగూర్ రెండు వరుసగా భారీ విజయాలు సాధించి కెరియర్లో మంచి ఫామ్‌లో ఉన్నారు ..ఆ సమయంలో ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవితో ఓ భారీ గ్రాఫిక్ చిత్రం చేద్దాం అని డేట్స్ తీసుకున్నారంట .ఆ భారీ గ్రాఫిక్ చిత్రానికి దర్శక బాధ్యతలు కోడి రామకృష్ణ కి అప్పగించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి .
ఐతే చిరంజీవి లాంటి స్టార్ హీరోతో ఇలా గ్రాఫిక్స్ సినిమా చేసేకంటే మంచి కమర్షియల్ సినిమా చేస్తే వర్క్ అవుట్ అవుతుంది అని చెప్పారు కోడి రామకృష్ణ .కాగా నా దగ్గర డ్యూయల్ రోల్ తో మంచి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది అది చేద్దాం అన్నారంట కోడి రామకృష్ణ ..కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి మాత్రం అందుకు మక్కువ చూపకుండా ఎలాయినా గ్రాఫిక్స్ చిత్రం చేయాల్సిందే అని పట్టుబట్టారట .
పోనీ చిరంజీవిని అయినా ఒప్పిద్దాం కమర్షియల్ చిత్రం చేసేందుకు అని అనుకున్నారంట కోడి రామకృష్ణ. కానీ అయన కూడా గ్రాఫిక్స్ చిత్రం వైపే మక్కువ చూపారట .దీంతో ఆయన కష్టపడి చిరంజీవి కోసం ఫాంటసీ కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ సిద్ధం చేసి ఆ సినిమా తెరకెక్కించారట .అంజి కోసం చాలా రీసెర్చ్ చేసి చాలాకాలం షూటింగ్ చేసారంట .ఇక చిరంజీవి అంజి సినిమా కోసం చాలా కష్టపడ్డారట .
ఈ మూవీ పతాక సన్నివేశం కోసం చిరంజీవి ఒకే షర్ట్ ఉతకకుండా రెండేళ్లు వేసుకోవలసివచ్చిందంట ..అంజి సినిమానే తనకు తొలి సినిమా అన్నట్టు చాలా అంకితభావంతో నటించారంటా చిరంజీవి .ఇక ఆ చిత్రం ఫలితం నిరాశపరిచిన నాకు మాత్రం వ్యక్తిగతంగా చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది అని తెలిపారు ..అంచనాలు తార స్థాయికి చేరుకోవడం వల్లే సినిమా ప్లాప్ అయిందని అన్నారు స్వర్గీయ కోడి రామకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: