ఎన్టీఆర్ 30 : షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్క బోతున్నట్లు చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి 9 భాషలలో విడుదల చేయాలి అని ఆలోచనతో కొరటాల శివ ఈ మూవీ స్క్రిప్ట్ పై చాలా వర్క్ చేయడం వల్ల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడం డిలే అవుతుంది అని మొదట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో సరికొత్త స్లిమ్ లుక్ లో కనబడడం కోసం కసరస్తులు చేస్తుండడం వల్ల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడం డిలే అవుతుంది అని వార్తలు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ.లో బాలీవుడ్ బ్యూటీ జాన్వివి కపూర్ , జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించ నుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ ని కొరటాల శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: