బాలకృష్ణ కోసం ప్రశాంత్ వర్మ ఎదురు చూపులు !

Seetha Sailaja
నందమూరి సింహం బాలకృష్ణ స్పీడ్ మామూలుగా లేదు. టాప్ యంగ్ హీరోలు కూడ చేయని డిఫరెంట్ పాత్రలను సునాయాసంగా చేస్తూ తాను ఇప్పటికీ యంగ్ హీరోని మాత్రమే అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న బాలయ్యతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక డిఫరెంట్ మూవీని చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

డిఫరెంట్ కథలతో విలక్షణమైన సినిమాలను తీయగల ప్రశాంత్ వర్మ తాను తయారుచేసిన కథకు సరైన హీరో దొరికేదాకా ఆ మూవీని మొదలుపెట్టడు అని అంటారు. మాస్ సినిమాలకు చిరునామా బాలకృష్ణ అలాంటి హీరోతో ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమాను తీయగలడు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రశాంత్ వర్మకు ఒక కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి బాలయ్య తో సినిమా తీయమని చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారంమేరకు ప్రశాంత్ వర్మ హాలీవుడ్ రేంజ్ లో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ తయారుచేసి దానికి సంబంధించిన ఒకొక్క కథలో ఒకొక్క టాప్ హీరో నటించే విధంగా మాష్టర్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్లాన్ లో భాగంగా బాలయ్యతో సినిమా ఉంటుంది అని అంటున్నారు. అయితే ప్రశాంత్ వర్మ సినిమాలు అన్నీ హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటాయి. కానీ బాలకృష్ణ సినిమాలకు మాస్ ప్రేక్షకులు ఎక్కువ.

అందువల్ల బాలయ్య కోసం అతడు చాల మారవలసి ఉంటుంది అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ దర్శకుడు దృష్టి అంతా అతడి లేటెస్ట్ మూవీ హనుమాన్ పై ఉంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ కు ఇప్పటికే మంచి స్పందన రావడంతో దానిపై అంచనాలు బాగా ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య అనీల్ రావిపూడి మూవీ ప్రాజెక్ట్ లో ఉన్నాడు. ఆతరువాత బోయపాటితో సినిమాను చేస్తాడ లేక వెరైటీగా ఉంటుందని ప్రశాంత్ వర్మను ఎంచుకుంటాడ అన్నది రానున్నరోజులు తెలియచేస్తాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: