"ఎన్టీఆర్ 30" వ మూవీలో ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిన ఆ హీరోయిన్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ లను కూడా అదే రేంజ్ లో చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ.ని పాన్ ఇండియా స్థాయికి మించి 9 భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా , అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ ప్రకటించి చాలా కాలమే అవుతున్న , ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి మాత్రం ఈ మూవీ యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ జాన్వివి కపూర్ ను ఎన్టీఆర్ 30 వ సినిమాలో నటించడానికి సంప్రదించగా , ఈ ముద్దుగుమ్మ వెంటనే ఆ ఆఫర్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే జాహ్నవి కపూర్ కు ఇది వరకే అనేక తెలుగు మూవీ నుండి ఆఫర్ లు రాగా ఈ ముద్దు గుమ్మ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: