ఆ బ్యాక్ డ్రాప్ లో "ఇండియన్ 2" మూవీ..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించి , భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ ద్వారా ఇటు హీరో గా కమల్ హాసన్ కు , అటు దర్శకుడుగా శంకర్ కు ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. ఇలా భారతీయుడు మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వల్ గా కమల్ హాసన్ హీరో గా దర్శకుడు శంకర్ "ఇండియన్ 2" అనే పేరు తో సీక్వెల్ ను రూపొందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో కమల్ హాసన్ 90 ఏళ్ల వృద్ధుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇండియన్ 2 మూవీ కథ 1920 సంవత్సరం బ్యాక్ డ్రాప్ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ ఈ మూవీ లో 90 ఏళ్ల వృద్ధుడు పాత్రలో కనిపించని ఉండడంతో ఈ పాత్ర కోసం కమల్ హాసన్ కు ప్రోస్థటిల్ మేకప్ ను వాడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: