రామ్ చరణ్ కు అరుదైన అవార్డ్..!!

murali krishna
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ అని  మనం చెప్పొచ్చు.. మార్చి 25 వ తారీఖున విడుదలైన #RRR చిత్రం అఖండ విజయం సాధించి పాన్ వరల్డ్ రేంజ్ లో తనకి గుర్తింపుని తెచ్చిపెట్టింది..ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనకి అంతర్జాతీయ పురస్కారాలలో నామినేట్ అయ్యేవిధంగా చేసింది అని చెప్పొచ్చు..
అభిమానులు గర్వపడే రేంజ్ లో ఆయన  అక్ట్ చేసాడు.. ఇక తాజాగా ఆయన తండ్రి కాబోతున్నాడు అనే వార్త కూడా అభిమానులను  ఎంతొ సంబరాలు చేసుకునే విధంగా చేసింది.
రాంచరణ్ లేటెస్ట్ మూవీ ఒక్కటే ఆయనకు శరాఘాతంగా మారింది. ఆచార్య సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవడం కాస్త  అందరినీ నిరాశకి గురి చేసినా, అది ఆయన ఖాతాలోకి రాదు..ఎందుకంటే అది చిరంజీవి సినిమా కాబట్టి..ఇక ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే అవ్వడం విశేషం..ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఒక సినిమానికుడా చేస్తున్నా సంగతి మనకి తెలిసిందే.
ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ తో బ్యాక్ 2 బ్యాక్ సినిమాలు చేస్తున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.. వీటితో పాటు ఆయనకీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ కూడా దక్కే అవకాశం ఉంది అనే వార్త అభిమానులను మరింత ఎక్కువ ఆనందపరిచింది.. ఇలా ఈ ఏడాది మొత్తం ఆయనకి శుభాలే జరిగాయి.. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయనకీ మరో అరుదైన గౌరవం  కూడా దక్కింది.. అసలు విషయానికి వస్తే ఈరోజు అహ్మదాబాద్ లో స్వామి మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి..ఈ ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , ముఖేష్ అంబానీలతో పాటుగా రామ్ చరణ్ కి కూడా ప్రత్యేక ఆహ్వానం లభించింది.
ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ మరియు ముఖేష్ అంబానీలతో కలిసి పాల్గొనడం రామ్ చరణ్ కి లభించిన అరుదైన గౌరవం అని చెప్పొచ్చు,ముఖేష్ అంబానీతో కొద్దిసేపటి వరకు ఆయన చర్చించాడు కూడా.. #RRR చిత్రం తర్వాత నార్త్ ఇండియాలో రామ్ చరణ్ క్రేజ్ ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ కి చేరుకుంది.. రీసెంట్ గానే ఆయనకీ NDTV ట్రూ లెజెండ్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో 'ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా' అవార్డు దక్కిన విషయం మనకీ తెల్సిందే. అందుకే ఏకంగా భారత ప్రధాని, దేశంలోనే అపర కోటీశ్వరుడితో కలిసి పాల్గొనడం మంచి విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: