ఆ స్టార్ హీరో చేతిలో దారుణంగా మోసపోయా..అంజలి షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో అనేక రకమైన పుకార్లు రావడం సహజం. చాలావరకు వీటన్నిటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు సెలబ్రిటీలు. అయితే పీకుల మీదకు వస్తే కానీ రియాక్ట్ అవ్వరు.  తాజాగా నటి అంజలి తనపై గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రేమ ,పెళ్లి, బ్రేకప్ పుకార్లపై నోరు విప్పింది. ఆమె మాట్లాడుతూ ఇదిఅంత ట్రాష్ అంటూ కొట్టి పారేసింది. అంతే కాదు ఆమె నటించిన ఫాలో ప్రమోషన్ లో పాల్గొన్న ఈమె రూమర్స్ కి చెక్ పెట్టింది. అయితే ఆమెకి పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్తూనే తనకి నచ్చిన వరుడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని గత కొద్దిరోజులుగా అమెరికాలో సెటిల్ అయిన బిజినెస్మెన్ తో వివాహం జరిగింది అంటూ.

 అనేక రకమైన వార్తలు వచ్చాయి. ఇక ఎక్కడ ఇలాంటి రూమర్స్ పై నోరు విప్పని ఈమె.. ఫాలో ప్రమోషన్స్లో తన పెళ్లి వార్తలు ఫేక్ అని కొట్టి పడేసింది. దీంతో ఆగకుండా మీడియాకి మరొక మసాలా న్యూస్ కూడా చెప్పింది అంజలి. అయితే పెళ్లి వార్త డైవర్ట్ చేయడానికి లేక నిజమో కానీ ఆమె ఒకరి ప్రేమలో ఘోరంగా మోసపోయినట్లు చెప్పింది .మీడియా అడగకముందే ఆమె బ్రేకప్ కి సంబంధించిన ట్రాజెడీని చెప్పింది. గతంలో ఈమె ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. అది ఓ విషపూరితమైన బంధం అని ఎన్నో ఆశలు పెట్టుకున్న... కానీ ఆయన వల్ల నిరాశే ఎదురయ్యిందని ఆ వ్యక్తి పేరు మాత్రం ఆమె బయట పెట్టలేదు.

ఇక ఆ బంధానికి అక్కడితో బ్రేక్ పడింది కాబట్టి పేర్లు అవసరం లేదని చెప్పుకొచ్చింది అంజలి. ఇక జర్నీ ఫేం జై తో రిలేషన్ లో ఉన్నానంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించింది. ఆమెకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారని నేను ఎవరితో స్నేహంగా ఉంటాను అనేది నా ఇష్టం అని నేను ఫలానా హీరోతో రిలేషన్ లో ఉన్నానని ఎప్పుడూ చెప్పలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ప్రేమ పెళ్లి పక్కన పెడితే అంజలి చేసిన విష బంధం కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి .దీంతో ఈ వార్త విన్న ఆమె అభిమానులు అంజలిని ఎవరు అంతలా మోసం చేశారు అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: