పెళ్లి అంటేనే ఫైర్ అవుతున్న రెజీనా.. కారణం అదేనా..?

Anilkumar
టాలీవుడ్ అందాల భామ రెజినా కసండ్రా  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటగా ఈమె శివా మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె కెరియర్ ప్రారంభించిన ఈమె చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తమిళ్ కన్నడ భాషలో నటించి తనకు మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో రెజీన  కెరియర్ బాగాలేదు అని చెప్పాలి. కొత్త హీరోయిన్లు వచ్చారా లేక ఈమె కథలు ఎంపిక చేసుకోవడంలో చేసే పొరపాట్లు కారణంగానే ఆమె గ్రాఫ్ పడిపోయింది. స్టార్ హీరోలు పట్టించుకోకపోవడంతో ఈ అమ్మడు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ కథలలో కూడా నటిస్తుంది.

అయితే ప్రస్తుతం ఈమె ఒక వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఇక 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించిన ఈమె మాతృభాష తమిళం. అయితే నేటితో ఈమెకి 32 సంవత్సరాలు నిండాయి. అయితే మూడు పదుల వయసులో కూడా ఈ అమ్మడు ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పెళ్లి చేసుకుంటానో లేదో కూడా క్లారిటీ లేదు అని  ఎవరిపై ఆధారపడకుండా బ్రతకడం  ఆమె తల్లి ఆమెకు చిన్నప్పుడే నేర్పిందని... అందుకే జీవితంలో తోడు కావాలో వదో అనే విషయం ఎప్పటికీ ఆలోచించను అని చెప్పుకొచ్చింది.

గతంలో తాను ఒకరితో ప్రేమలో ఉన్నానని అతనితో 2020 లోనే బ్రేకప్ కూడా జరిగింది అని... ప్రస్తుతం ఆమె సింగిల్గానే ఉంటున్నాను అంటూ స్పష్టత ఇచ్చింది. తను ప్రేమలో పడింది ఎవరితో అన్నది మాత్రం రివీల్ చేయలేదు రెజినా. అయితే గతంలో మెగా హీరోతో ఈమె ప్రియమైన నడిపింది అని వార్తలు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి. ఇక ఆ హీరో తోనే బ్రేకప్ అయ్యిందేమో ఈ కారణంగానే ప్రేమ పెళ్లి పై నమ్మకం లేదు అంటూ ఈమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లో చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: