ప్రేక్షకులను నిరాశపరిచిన రజనీకాంత్ జైలర్..!

Divya
తలైవా రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం జైలర్ అయితే డిసెంబర్ 12వ తేదీన ఆయన పుట్టినరోజు కానుకగా ఆయన లుక్ ని పరిచయం చేస్తూ టీజర్ గ్లింప్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ముఖ్యంగా సుదీర్ఘ కెరియర్ లో మొదటిసారి రజనీకాంత్ జైలర్ పాత్రను పోషిస్తున్నాడు . నెల్సన్ డైరెక్టర్ కాగా సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది . వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆరోజు తమిళ్ న్యూ ఇయర్ కావడంతో న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే రజినీకాంత్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఈయన నటిస్తున్న వరుస సినిమాలు చేదు జ్ఞాపకాలను మిగులుస్తున్నాయి. 2020లో వచ్చిన దర్బార్,  2021 లో వచ్చిన పెద్దన్న సినిమాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి.  దాంతో జైలర్ సినిమాతో ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచేలా ఉంటుందని దర్శకుడు నెల్సన్ ఇప్పటికే హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీని నిలబెట్టుకుంటున్నట్లు కనిపించడం లేదు.  ఎందుకంటే ఇటీవల ఈ సినిమా నుంచి ఇంట్రో టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు అని స్పష్టం అవుతుంది.
ఈ గ్లింప్ లో రజనీకాంత్ కూల్ గా రెడీ అయ్యి తనదైన స్టైల్ లో బాడీ స్ప్రే కొట్టుకుంటూ కనిపించాడు.  అనంతరం నింపాదిగా నడుచుకుంటూ వచ్చి పెద్ద కత్తి తీయడంతో గ్లింప్స్ పూర్తవుతుంది. ముఖ్యంగా జైలర్ సినిమా నుంచి విడుదలైన ఈ టీజర్ లో రజనీకాంత్ స్క్రీన్ ప్రజెంట్ అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇంట్రో టీజర్ అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని నెటిజన్లు సైతం అంటున్నారు.  మరి ఈ సినిమాతో రజినీకాంత్ కు విజయాన్ని అందిస్తాడా అన్న సందేహం కూడా మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: