మహేష్... పూజ హెగ్డే లపై అదిరిపోయే సన్నివేశాల చిత్రీకరణ అప్పటినుండే..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం బ్రహ్మోత్సవం , స్పైడర్ వంటి వరస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట మూవీ లతో వరస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తేరకేక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు మూవీ యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో 28 వ మూవీ గా రుపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల రెండవ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది.

రెండవ షెడ్యూల్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండవ షెడ్యూల్లో పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. రెండవ షెడ్యూల్ లో భాగంగా మహేష్ బాబు మరియు పూజా హెగ్డే లపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ రెండవ షెడ్యూల్ కోసం సారథి స్టూడియోలో ఒక ప్రత్యేక సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: