ప్రభాస్ కెరియర్ లోనే ఆ మూవీలోని యాక్షన్ సన్నివేశం భారీగా నిలవనుందట..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి అయింది. వచ్చే సంవత్సరం సమ్మర్ వరకు ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ మూవీ లోని ఫ్రీ ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశం అద్భుతమైన రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ యాక్షన్ ఎపిసోడ్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం దర్శకుడు ప్రశాంత్ నే అత్యంత శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ యాక్షన్స్ సన్నివేశం కోసం ప్రశాంత్ నిల్ హాలీవుడ్ కొరియో గ్రాఫర్ లను రంగం లోకి దించబోతున్నట్లు సమాచారం. సలార్ మూవీ లోని ఫ్రీ ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ లో హీరో గా నటించడం , కే జి ఎఫ్ మూవీ తర్వాత ప్రశాంత్  నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో సలార్ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: