సూర్యతో సపరేట్ గా ఆ క్యారెక్టర్ తో మూవీ చేయబోతున్నాను... లోకేష్ కనకరాజు..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సందీప్ కిషన్ , రెజీనా కేసాండ్ర ముఖ్య పాత్రలలో తేరకెక్కిన మా నగరం మూవీ తో అద్భుతమైన విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును లోకేష్ కనకరాజు తమిళ సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఆ తర్వాత కార్తీ హీరో గా తెరకెక్కిన ఖైదీ మూవీ తో తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత మాస్టర్ మూవీ తో మంచి విజయాన్ని లోకేష్ కనకరాజు అందుకున్నాడు. ఈ సంవత్సరం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ లో లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా నటించగా , విజయ్ సేతుపతి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మలయాళ నటుడు పహద్ ఫాజిల్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , తమిళ నటుడు సూర్య ఈ మూవీ లో రోలెక్స్ అనే గెస్ట్ రోల్ లో నటించాడు. సూర్య "విక్రమ్" మూవీ లో నటించింది చాలా తక్కువ నడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఈ మూవీ విజయంలో సూర్య పాత్ర కీలకమైన రోల్ ను పోషించింది. ఇది ఇలా ఉంటే తాజాగా లోకేష్ కనకరాజు ఓ ఇంటర్వ్యూ లో తన తదుపరి మూవీ లపై క్లారిటీ ఇచ్చాడు. అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లో విక్రమ్ మూవీ లో రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య తో ఫుల్ లెన్త్ లో రోలెక్స్ పాత్ర పై ఒక మూవీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: