సునీల్ ఇండస్ట్రీకి రాకముందు అలాంటి పని చేసేవాడా..!?

Anilkumar
తెలుగు చిత్రపరిశ్రమలో  కమీడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి దాని అనంతరం హీరోగా...విలన్ గా తనను తాను మార్చుకుని ప్రేక్షకులను అలరించిన కమెడియన్ సునీల్ గురించి మనందరికీ తెలిసిందే. హీరోగా సక్సెస్ ని అందుకున్నప్పటికీ విలన్ గా ప్రేక్షకులను భయపెట్టినప్పటికీ కమీడియన్ గా మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు .ఆయన నటనతో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ఎలాంటి సందర్భంలోనైనా ఎవరినైనా నవ్వించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. అందుకే సునీల్ అంటే చాలామందికి ఇష్టం. ఒక్కొక్కసారి తన సినిమాల ద్వారా స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటూ ఉంటాడు.

 కొన్ని పాత్రలకు ప్రత్యేకించి పెట్టింది పేరుగా సునీల్ మిగిలిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన దాదాపుగా 180 సినిమాలలో హాస్య నటుడిగా నటించాడు. అందాల రాముడు సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న ఈయన భీమవరం దగ్గర పెద్దపల్లి గ్రామంలో 1974 ఫిబ్రవరి 28న జన్మించాడు. ఈయన తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సునీల్ కి ఐదు సంవత్సరాల వయసు ఉండగా చనిపోయాడు .తల్లికి ఉద్యోగం రాగా చిన్నప్పటినుండి అమ్మమ్మ ఊర్లోనే పెరిగి నాలుగవ తరగతి వరకు చదువుకొని ఇంటర్ వరకు భీమవరంలో చదివాడు.

చిన్నప్పటినుండి సినిమా ఇండస్ట్రీకి రావాలని ఉన్న ఈయన భీమవరం కాలేజీలో ఫిలిం ఆర్ట్స్ కోర్స్ లో చేరాడు .ఫ్రెండ్స్ తో సినిమాలు ఎక్కువగా చూస్తే ఈయన ఒకసారి చిరంజీవి లాగా డాన్స్ చేయాలని భావించి డాన్స్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరడు. 1994లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచనతో ఆయన దగ్గర ఉన్న బైకును అమ్మేసి ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్ లో అవకాశాల కోసం తిరిగాడు. అప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ ఆయన మిత్రుడు మురళితో కలిసి రూమ్ షేర్ చేసుకున్నారు .అయినప్పటికీ ఎక్కడ తిరిగినా అవకాశాలు రాకపోవడంతో తిరిగి భీమవరం వచ్చి మళ్లీ కుటుంబ సభ్యులతో ఉన్నాడు. దాని అనంతరం కుటుంబ సభ్యుల ఎంకరేజ్మెంట్ తో రెండు సంవత్సరాల తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో చిన్న పాత్రలో అలరించాడు. దాని అనంతరం నువ్వు నేను సినిమాకు ఈయనకు హాస్యనటుడిగా నంది అవార్డు కూడా రావడం జరిగింది ..అలా సినిమాలలో సెటిలైన తరువాత పెద్దల సమక్షంలో శృతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.. దాని అనంతరం వీరికి ఒక పాప బాబు కూడా ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: