గుణశేఖర్ కూతురు పెళ్ళి నేపధ్యంలో మహేష్ బన్నీ అభిమానుల రగడ !

Seetha Sailaja

అల్లు అర్జున్ మహేష్ బాబుల మధ్య చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేదు అని అంటూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ ఫంక్షన్స్ లో కలుసుకునే సందర్భాలు చాల తక్కువ. ఈవిషయాన్ని పక్కకు పెడితే మహేష్ వీరాభిమానులకు అల్లు అర్జున్ వీరాభిమానులకు ఎప్పుడు సోషల్ మీడియాలో రగడ జరుగుతూనే ఉంటుంది.

తమ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కలక్షన్స్ రికార్డుల విషయమై బన్నీ మహేష్ అభిమానుల మధ్య ఏదో ఒక రగడ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్ళి రిసెప్క్షన్ లో అనుకోకుండా కలిసిన బన్నీ మహేష్ ల తీరును విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో మళ్ళీ మహేష్ బన్నీ అభిమానుల మధ్య వార్ మొదలైంది.  

నీలిమ గుణ వివాహ రిసెప్క్షన్ కు మహేష్ రావడం జరిగింది. సరిగ్గా మహేష్ పెళ్ళి రిసేప్క్షన్ స్టేజ్ పై ఉండగానే అనుకోకుండా అల్లు అర్జున్ కూడ రావడం జరిగిందట. బన్నీని చూడగానే గుణశేఖర్ అతడిని దగ్గర ఉండి వేదిక పైకి తీసుకు వచ్చాడట. దీనితో బన్నీ మహేష్ లు ఒకరికొకరు ఎదురుపడటంతో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం జరిగింది కానీ వారిద్దరూ ఎక్కడా ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సందర్భం కనిపించక పోవడంతో మీడియా వర్గాలు బన్నీ మహేష్ లను ఒకే యాంగిల్ లో పెట్టి ఫోటోలు తీద్దాము అని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు మహేష్ అల్లు అర్జున్ లు వేదిక పైకి వచ్చిన విధానం పై సోషల్ మీడియాలో రగడ జరుగుతోంది. మహేష్ సింపుల్ గా వస్తే బన్నీ మాత్రం చాల ఆర్భాటంగా తన బౌన్సర్లను ముందు వెనుక పెట్టుకుని హడావిడి చేస్తూ స్టేజ్ పైకి వచ్చిన విషయాన్ని ఎత్తి చూపుతూ పెళ్ళికి వచ్చినప్పుడు కూడ బౌన్సర్లు ఎందుకు అంటూ మహేష్ అభిమానులు బన్నీ అభిమానులను తమ కామెంట్స్ తో కార్నర్ చేస్తున్నారు. గుణశేఖర్ కూతురు పెళ్ళి వేడుకలో బన్నీ మహేష్ సామరస్యంగా హృదయపూర్వకంగా మాట్లాడుకుని ఉంటే ఈ రగడ తప్పేది అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: