"లవ్ టుడే" డైరెక్టర్ తో తలపతి విజయ్ మూవీ..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తలపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తలపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొందుతుంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో , వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ "లవ్ టు డే" మూవీ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ , తలపతి విజయ్ కి ఓ స్టోరీ చెప్పడం ... విజయ్ ఆ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని జరిగిపోయినట్లు కోలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లవ్ టుడే మూవీ కి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ,  ఈ మూవీ లో హీరో గా కూడా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: