8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా "హిట్ 2" మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేష్ తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ,  నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ మూవీ 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6.43 కోట్ల షేర్ 11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండవ రోజు ఈ సినిమా 4.53 కోట్ల షేర్ 7.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు ఈ మూవీ 3.95 కోట్ల షేర్ 7.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. నాలుగవ రోజు ఈ సినిమా 1.30 కోట్ల షేర్ 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఐదవ రోజు ఈ సినిమా 1.07 కోట్ల షేర్ 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్  లను వసూలు చేసింది.  ఆరవ రోజు ఈ సినిమా 0.70 కోట్ల షేర్ 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఏడవ రోజు ఈ సినిమా 0.48 కోట్ల షేర్ 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 8 వ రోజు ఈ సినిమా 0.42 కోట్ల షేర్ 0.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 8 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18.88 కోట్ల షేర్ , 34.3 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: