ఆ తేదీ నుండి "ఎస్ఎస్ఎంబి 28" మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్న పూజా హెగ్డే..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. పూజ హెగ్డే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది వరకే మహేష్ బాబు మరియు పూజ హెగ్డే కాంబినేషన్ లో మహర్షి మూవీ తెరకెక్కింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని వీరిద్దరి జోడి కి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఇది వరకే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు , ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలకు అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 వ తేదీ నుండి పూజా హెగ్డే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బంధం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ చిత్రకరణ ఎస్ఎస్ఎంబి 28 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: