చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో క్లాస్ లుక్ లో మైమరిపిస్తున్న శివాత్మిక..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ శివాత్మిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయినటు వంటి రాజశేఖర్ కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన  ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించి , తన ప్రతిభ తో సినిమా అవకాశాలను దక్కించు కుంటుంది. శివాత్మక దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించు కుంటుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ పంచతంత్రం అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో మొదలైంది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇలా సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శివాత్మిక అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శివాత్మక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి మెడలో ఒక లాకెట్ ను వేసుకొని క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: