నాపై వచ్చే ట్రోల్స్ ను అలా ఆస్వాదిస్తుంటాను... మంచు లక్ష్మి..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు లక్ష్మి ,  సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు మూవీ లో ప్రతి నాయకి పాత్రలో నటించి ఆ మూవీ లోని తన నటన తో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమా లలో ఎన్నో ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే సినిమా లతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా మంచు లక్ష్మి నటించింది. అలాగే పలు టీవీ షో లకు మరియు పలు "ఓ టి టి" షో లకు మంచు లక్ష్మి హోస్ట్  గా కూడా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి తనపై వచ్చే ట్రోల్స్ పై స్పందిస్తుంది.

తనపై వచ్చే ట్రోల్స్ పై మంచు లక్ష్మి ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయం గురించి చెప్పుకొచ్చింది.  తాజాగా మంచు లక్ష్మి తనపై వచ్చే ట్రల్స్ గురించి స్పందిస్తూ ... తనపై నిత్యం సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్స్ మరియు మీన్స్ ను చాలా ఆస్వాదిస్తూ ఉంటాను అని మంచు లక్ష్మి తెలిపింది. అలా ట్రోల్స్ మరియు మీమ్స్ చేసే వాళ్లకు ఇంకా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసేందుకు నేను క్లూ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం మంచు లక్ష్మి మోహన్ లాల్ హీరో గా తెరకెక్కుతున్న మాన్ స్టర్ మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తుంది. ఈ మూవీ లో నటించడం పై మంచు లక్ష్మి స్పందిస్తూ ... మోహన్ లాల్ హీరో గా తేరకెక్కుతున్న మాన్ స్టర్ మూవీ లో నేను మంజు అనే పాత్రలో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే నటిగా కంటే కూడా టీవీ కార్యక్రమల ద్వారా నన్ను నేను గా ప్రేక్షకులను చూపించుకో గలుగుతున్నానని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: