నాగచైతన్య "కస్టడీ" మూవీ మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు అయినటు వంటి అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం కూడా మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో మొదటగా నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు మూవీ లో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో నాగ చైతన్య నటనcకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ లో నాగ చైతన్య సోలో హీరో గా నటించాడు. రాసి కన్నా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత లాల్ సింగ్ చడ్డ అనే హిందీ మూవీ లో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించాడు. అమీర్ ఖాన్ ఈ మూవీ లో హీరో గా నటించిన  ఈ మూవీ లో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య , వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కస్టడీ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కృతి శెట్టి ఈ మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యెక్క మ్యూజిక్ రైట్స్ ను జంగ్లీ సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: