నడుమందాలతో మైమరపిస్తున్న మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ  , సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనములు నిలుపరాదు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది .
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సంవత్సరం మొదటగా మీనాక్షి చౌదరి "ఖిలాడి" మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా మీనాక్షి చౌదరి , అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో నాని నిర్మాత గా తెరకెక్కిన హిట్ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో మీనాక్షి చౌదరి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: