విడాకులు ఇస్తున్న నితిన్....నిజమేనా..!!

murali krishna
టైటిల్ చూస్తేనే దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయినట్లు ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో మాత్రమే కాదు అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు గత రెండేళ్లలో విడాకులు తీసుకుంటూనే వస్తున్నారు.ఇప్పుడు నితిన్ విడాకులు తీసుకోబోతున్నాడా ? అన్న టైటిల్ చూస్తే చాలా మంది షాక్ అవుతారు. అయితే పైన టైటిల్ నిజమే. అయితే అది సినిమాలో మాత్రమే. నితిన్ రీల్ లైఫ్‌లో నటించే సినిమాలో భార్యకు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా జీవించే భర్త పాత్రలో కనిపించబోతున్నాడు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఛలో, భీష్మ సినిమాల తో బ్లాక్‌బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసు కున్నాడు. ఈ రెండు సినిమాలు వెంకీని మాంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ ‌గా ఫ్రూవ్ చేశాయి. ఈ క్రమంలోనే భీష్మ తర్వాత వెంకీ కుడుముల నితిన్‌ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మధ్య లో చిరంజీవి తో కూడా వెంకీ చర్చలు జరిపాడు. చిరు ఎటూ తేల్చకపోవడం తో ఇప్పుడు తిరిగి నితిన్‌ తోనే కమిట్ అయ్యాడు.
ఈ ప్రాజెక్టులో నితిన్ భార్య కు విడాకులు ఇచ్చేసి ఒంటరి గా జీవించే భర్తగా కనిపించబో తున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరమై ఆ ఎడబాటుతో జీవించే ఓ మగాడి కథగా వెంకీ చాలా ఫన్నీ గా ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే స్క్రిఫ్ట్ కూడా రెడీ అయ్యిందని.. నితిన్‌ కు కూడా సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్ ? ఇక ఈ ప్రాజెక్టు ను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు భారీ బడ్జెట్ ‌తో నిర్మిస్తున్నారు.
భీష్మ ఎలాగూ బ్లాక్‌బస్టర్ కొట్టి భారీ వసూల్లు సాధిం చింది. ఇటు మైత్రీ మూవీస్ బ్యాకప్‌. అటు వెంకీ కుడు ముల డైరెక్షన్ అంటే ఈ క్రేజీ కాంబినేషన్ మామూలుగా ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: