నేను ఆ టైపు కాదు... కీర్తి సురేష్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ ఇప్పటికే అనేక తెలుగు మరియు తమిళ మూవీ లలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ , రామ్ పోతినేని హీరో గా తెరకెక్కిన నేను శైలజ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని , తన నటన తో , అందచందాలతో ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుని , ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా కీర్తి సురేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ , మెగాస్టార్ చిరంజీవి హీరో గా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో తలకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లోకి కెరీర్ ను ముందుకు సాగిస్తున్న కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ ... మన ప్రవర్తనను బట్టి క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందేమో. ఇలాంటి ఘటన నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఒక వేళ ఎవరైనా నన్ను గనుక కమిట్మెంట్ అడిగినట్లు అయితే నేను అంగీకరించను. నేను ఆ టైప్ కాదు. అవకాశాలు రాకపోతే మూవీ లు మానేసి జాబ్ చేసుకుంటాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: