ఆ తేదీన రీ రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ "బద్రి" మూవీ..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం బద్రి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన అమీషా పటేల్ , రేణు దేశాయ్ హీరోయిన్ లుగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ మూవీ 20 ఏప్రిల్ 2000 సంవత్సరం భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా ఆ కాలంలో బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన ఈ సినిమాను థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఏ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది. బద్రి మూవీ ని డిసెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. మరి అప్పట్లో బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ రికార్డ్ లను నమోదు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. నిది అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: