ఎన్టీఆర్ ద్వారా అది అందుకోలేకపోయా అంటూ ఎమోషనల్ అయిన సమీర్.. అసలేమైందంటే..??

Anilkumar
సినిమాలలో విలన్ గా మరియు సీరియల్స్ లో ముఖ్య పాత్రలు పోషిస్తూ మంచి పాపులారిటీని దక్కించుకున్న సమీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఈయన సినిమాలలో ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించేవారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు, శాంతినివాసం వంటి సీరియల్స్ తో అందరికీ పరిచయమయ్యాడు. అనంతరం ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరిని మెప్పించాడు. దాని అనంతరం బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా రావడం జరిగింది. ఇదిలా ఉంటే  తాజాగా సమీర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది . ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కెరియర్ మొదట్లో ఆయన పడ్డ కష్టాలు గురించి చెప్పుకొచ్చాడు.  

ఈయన సొంతూరు వైజాగ్ అక్కడి నుండి శని రంగంలోకి అడుగు పెట్టి ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. సొంతూరులో ఉన్నప్పుడే రెండు సినిమా అవకాశాలను అందుకున్న ఈయన దాని అనంతరం హైదరాబాద్ కి రావడం జరిగింది .ఇక ఇందులో భాగంగా సమీర్ ఆ సమయంలో సెల్ ఫోన్స్ సరిగ్గా లేని కారణంగా ఒక మంచి ఆఫర్ ను పోగొట్టుకున్నాడని అప్పట్లో సెల్ ఫోన్స్ లేని కారణంగా ఆయన సన్నిహితుల ఫోన్ నెంబర్లను ఇచ్చాడని అదే సమయంలో ఆయనకి krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కృష్ణ రెడ్డి గారి సినిమాలో కృష్ణ గారి పక్కన ఒక మంచి అవకాశం వచ్చిందని ఆ విషయం ఆయనకి చాలా ఆలస్యంగా తెలిసిందని తో అవకాశం పోయిందని ఆయన చెప్పడం జరిగింది.

దాని అనంతరం శుభసంకల్పం సినిమా విజయంతో రవీంద్రభారతిలో అవార్డు ఫంక్షన్స్ జరగడంతో అక్కడికి వెళితే   గేటు దగ్గరే ఆపేసారట .ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు సమీర్ .సంకల్పం సినిమాలో నేను నటించాను అని చెప్పినా కూడా నన్ను లోపలికి రానివ్వలేదని దాని అనంతరం బాగా బ్రతిమలాడిన తర్వాత లోపలికి పంపారని అక్కడ పంపిన కూడా దాని లోపల ఇంకో గేటు దగ్గర లోపలికి రానివ్వలేదని ఆయన చెప్పడం జరిగింది. లోపల నా పేరు పిలుస్తున్నారు అది నేనే అని వాళ్ళకి చెప్పిన నమ్మడం లేదని అక్కడ చూపించుకోవడానికి నా దగ్గర ఎలాంటి సాక్షాలు కూడా లేవని ఆయన చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఇన్విటేషన్ నా దగ్గర లేకపోవడంతో ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ఆ అవార్డును నేను దక్కించుకోలేకపోయాను అంటూ ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: