రాజమౌలి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఎన్ టీ ఆర్ ..!!

murali krishna
రాజమౌళి కీర్తి దినదిన ప్రవర్ధమానం  విపరీతంగా పెరిగిపోతుంది. ఆయన్ని పలు అంతర్జాతీయ అవార్డ్స్ వరిస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.
బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ మూవీ గౌరవాన్ని పెంచారు. ఆర్ ఆర్ ఆర్ తో ఆయన ఇమేజ్ మరో స్థాయికి చేరింది అని మనం చెప్పొచ్చు. రాజమౌళి గవర్నర్స్ అవార్డు ఈవెంట్లో పాల్గొన్నారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి బెస్ట్ డైరెక్టర్ గా సన్ సెట్ సర్కిల్ - 2022 అవార్డు గెలుపొందారు.
తాజాగా మరో అంతర్జాతీయ అవార్డు రాజమౌళిని వరించింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర దర్శకుడిగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ వర్గాలు రాజమౌళికి అభినందనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఈ అరుదైన సంఘటనపై   ఆయన ఇలా స్పందించారు. శుభాకాంక్షలు తెలిపారు.
'అభినందనలు జక్కన్న. ప్రపంచ వేదికపై మరింత వెలిగేందుకు ఇది కేవలం ఇది ఆరంభం మాత్రమే. ఇన్నేళ్ళలో నాకు మాత్రమే తెలిసిన మీ ప్రతిభ లోకానికి తెలియాల్సిన సమయం వచ్చింది…' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ ట్వీట్ పై రాజమౌళి, తారక్… నీ ట్వీట్ లో చిన్న తప్పుంది. నా జర్నీ కాదు, మన జర్నీ, అని రాజమౌళి ఇలా స్పందించారు. నేను ఏది సాధించినా ఆ ప్రయాణంలో, అభివృద్ధిలో, కీర్తిలో నువ్వు కూడా ఉంటావని రాజమౌళి పరోక్షంగా వెల్లడించాడు.
ఎన్టీఆర్-రాజమౌళి కెరీర్స్ కొంచెం అటూ ఇటుగా ఒకేసారి మొదలయ్యయి. దర్శకుడిగా రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ కాగా… ఎన్టీఆర్ కి ఫస్ట్ హిట్ ఇచ్చిన చిత్రం కుడా ఇదే,. ఇక ఎన్టీఆర్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది రాజమౌళినే. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి బాక్సాఫీస్ బద్దలు చేసింది. సింహాద్రి ఎన్టీఆర్ కి 7వ చిత్రం. రాజమౌళికి 2వ మూవీ. తర్వాత ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు చేశారు.
రెండు దశాబ్దాల కెరీర్లో రాజమౌళి కేవలం 12 చిత్రాలు చేస్తే అందులో 4 సినిమాలు ఎన్టీఆర్ తోనే చేశాడు  మరీ అంతటి అనుబంధం వారి మధ్య ఉంది. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రాజమౌళి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రేజీ సీక్వెల్ కోసం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. మరి మహేష్ మూవీ తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పార్ట్ 2 సెట్స్ పైకి తీసుకెళతారేమో  వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: