మొదటిసారి అదిరిపోయే రేంజ్ "టిఆర్పి" ని సొంతం చేసుకున్న "సీత రామం" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ దర్శకుడు ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు సీతా రామం అనే ప్రేమ కథ చిత్రనికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో ఈ మూవీ లో కనిపించగా , సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా దర్శకుడు హను రాఘవపూడి , హీరో దుల్కర్ సల్మాన్ , హీరోయిన్ మృనాల్ ఠాకూర్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బుల్లి తెర పై ప్రసారం అయింది. ఈ మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా స్టార్ మా చానల్లో ప్రసారం కాగా , మొదటి సారి ఈ మూవీ కి బుల్లితెరపై 8.73 "టి ఆర్ పి" వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ కి సూపర్ రెస్పాన్స్ బుల్లితెర ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: