వైరల్ అవుతున్న మంజుల కామెంట్స్....!!

murali krishna
ప్రముఖ సినీ నటి, నిర్మాత మంజులకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోయిన్ కావాల్సిన మంజుల కృష్ణ అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మంజుల ఎక్కువగా నటించడం జరిగింది.అయితే మంజుల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి, మహేష్ పెళ్లి గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంజుల మాట్లాడుతూ నాకు ఉన్న మంచి స్నేహితురాళ్లలో నమ్రత కూడా ఒకరని అన్నారు. ఆమె నాకు సిస్టర్ ఇన్ లా మాత్రమే కాదని అద్భుతమైన స్నేహితురాలు అని పేర్కొన్నారు. ఫ్యామిలీ వాల్యూస్ కు నమ్రత ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. నమ్రత ఎంతో బాగా మా ఫ్యామిలీలో కలిసిపోయిందని మంజుల పేర్కొన్నారు. మహేష్ నమ్రత పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్ అని మంజుల అన్నారు.
మాది లవ్ మ్యారేజ్ అని ఆ రీజన్ వల్లే మహేష్ మ్యారేజ్ కు కూడా నేను సపోర్ట్ చేశానని ఆమె కామెంట్లు చేశారు. జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయని మంజుల వెల్లడించారు. కుటుంబ గౌరవాన్ని పక్కన పెట్టి మేము పెళ్లి చేసుకున్నామని మంజుల పరోక్షంగా చెప్పుకొచ్చారు. మంజు లకు సోషల్ మీడియాలో కూడా పరవాలేదనే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.
మహేష్, మంజుల ఒకే సినిమాలో కలిసి కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ రావాలని అభి మానులు భావిస్తుండగా ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. మంజులను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మరోవైపు మహేష్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా త్రివిక్రమ్ సినిమా అతడు, ఖలేజా సినిమాలను మించి ఉండ నుందని సమాచారం అందుతోంది. మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: