హీరోయిన్ల చేత తిరస్కరించబడుతున్న 'డీజె టిల్లు'.....!!

murali krishna
చిన్న హీరో… అకస్మాత్తుగా ఓ పెద్ద విజయం… కొన్నిసార్లు అలా లాటరీ తగుల్తుంది… అలాగని ఇక నేనే తోపు అనుకుంటే, అలాగే వ్యవహరిస్తే చిక్కులొస్తయ్… దురదృష్టం కొద్దీ మన విష్వక్సేనులకు, మన జొన్నలగడ్డ సిద్ధులకు ఆ సోయి లేదు… డీజే టిల్లు అనుకోకుండా హిట్… ఆ దర్శకుడు టైటిల్ సాంగ్ ట్యూన్ భలే కుదిరేసరికి, దాన్నే దాదాపు బీజీఎంగా వాడుతూ సినిమా చివరిదాకా కొట్టాడు… కథ, కథనాల్లో లాజిక్కుల మాటెలా ఉన్నా, ప్రేక్షకులకు కొత్తగా నచ్చేసింది…సిద్ధూ ఇదంతా తన ఘనతే అనుకోవడం దగ్గర వచ్చింది సమస్య… డీజే టిల్లు సీక్వెల్ స్క్రిప్టు వర్క్‌తో సిద్ధూ ఇన్వాల్వ్ అయ్యాడు… అఫ్‌కోర్స్, ఫస్ట్ ఒరిజినల్‌లో కూడా తన కంట్రిబ్యూషన్ ఉంది… కానీ సిద్ధూ యాటిట్యూడ్‌లో ఏదో తేడా కొట్టేసింది… దాంతో ముందుగా దర్శకుడు విమల్ కృష్ణ ఇక ఈ సిద్ధూతో కుదరదని భావించి, ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు… కొత్తగా మల్లిక్ రామ్‌ను తీసుకొచ్చారు… ఇప్పటికైతే తన పేరే ఉంది…
అసలు చర్చ దర్శకుడి గురించి కాదు… హీరోయిన్ల గురించి… నిజానికి హీరోయిన్లు ఒక అవకాశం వచ్చి, తగినంత రెమ్యునరేషన్ ఇస్తే ఇక పెద్దగా అభ్యంతరాలు పెట్టరు… పైగా ఇది ఒక సక్సెస్ సినిమాకు సీక్వెల్… వాళ్లకూ ఆశ ఉంటుంది, ఇదీ హిట్టయితే తమ కెరీర్‌కు ఉపయోగం అని..! ముందుగా ఒరిజినల్‌లో చేసిన నేహా శెట్టి అనుకున్నట్టున్నారు… కానీ సిద్ధూయే వద్దన్నాడట… దాంతో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను లైన్‌లోకి తీసుకొచ్చారు… ప్రకటించారు కూడా…
ఏమైందో ఏమో గానీ… ఆమె కూడా ప్రాజెక్టు నుంచి వాకౌట్ చేసింది… నిజానికి ఆమె ఒక చాన్స్‌ను నిరాకరించేంత పెద్ద తార కాదు, అంత గిరాకీ కూడా ఏమీ లేదు… ఐనా సినిమా నుంచి తనే వెళ్లిపోయిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది… బహుశా అది సిద్ధూ యాటిట్యూడ్ అయి ఉంటుంది.అప్పుడే అయిపోలేదు… ప్రస్తుతం కార్తికేయ -2 సూపర్ హిట్ తరువాత అనుపమ పరమేశ్వరన్‌కు గిరాకీ ఏర్పడింది… రెమ్యునరేషన్ పెంచింది… 18 పేజెస్ సినిమాతో బిజీగా ఉంది… బటర్ ఫ్లయ్ అనే తెలుగు సినిమా, సిరెన్ అనే తమిళ సినిమా, ట్రుత్ షల్ ఆల్వేస్ ప్రివేల్ అనే మలయాళ సినిమా ఆమె చేతిలో ఉన్నాయి… ఐనా ఈ సినిమా కూడా ఒప్పుకుంది… ఇప్పుడు ఆమె కూడా జంప్ యిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: