మహేష్-త్రివిక్రమ్ సినిమాకి విడుదలకు ముందే కోట్ల నష్టం..ఎందుకు..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే. ఇదిలావుంటే ఇక మహేష్-త్రివిక్రమ్ నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మేరకు టాలీవుడ్ వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం అందుతుంది.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సెకండ్ హీరోయిన్ ఛాన్స్ పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలకు దక్కింది అంటున్నారు.కాగా  మహేష్ 28వ చిత్రంలో శ్రీలీల నటిస్తున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.ఇదిలావుంటే  మరో విశేషం ఏమిటంటే సీనియర్ నటి శోభన మహేష్ తల్లిగా నటిస్తున్నారట.

ఇక శోభన మహేష్ తల్లి పాత్ర చేస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. అయితే తెలుగులో శోభన చివరి చిత్రం 'గేమ్'. మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన ఈ మూవీలో ఆమె మోహన్ బాబు భార్య రోల్ చేశారు.కాగా  మహేష్ తల్లిగా ఆమె నటిస్తున్నారనే వార్త ఒకింత ఆసక్తి రేపుతోంది.  2023 సమ్మర్ కానుకగా త్రివిక్రమ్-మహేష్ మూవీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ సూచనలు కనిపించడం లేదు.అయితే  వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిలే అయ్యింది.ఇకపోతే మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. హీరో దర్శకుడి నిర్ణయంతో చిత్ర నిర్మాత భారీగా నష్టపోయారు అంటున్నారు.

ఇక పాన్ ఇండియా స్థాయిలో మూవీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేశారట.అయితే  పాన్ సబ్జెక్టు కి కావలసిన హంగులు అద్దారట. ఇక ఈ క్రమంలో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొత్తం వేస్ట్ అయ్యిందంటున్నారు.అయితే ఒక స్టార్ హీరో సినిమా ఒక షెడ్యూల్ బడ్జెట్ అంటే కోట్లలో ఉంటుంది.ఇక  ఆ రకంగా మూవీ విడుదలకు ముందే నిర్మాత సూర్యదేవర నాగవంశీకి నష్టం తెచ్చిపెట్టారన్న వాదన తెరపైకి వచ్చింది.కాగా పాన్ ఇండియా సబ్జెక్టుగా చేద్దామనే ఆలోచన త్రివిక్రమ్ దే అయినప్పటికీ దానికి మహేష్ కూడా మద్దతు తెలిపారట.అయితే తాజా కథనాల నేపథ్యంలో SSMB 28 చిత్ర షూట్ మరలా మొదటి నుండి స్టార్ట్ అయినట్లే అంటున్నారు.  బడ్జెట్ లెక్కలు, నిర్మాణ విలువలు కూడా మారిపోతాయి కాబట్టి… విడుదల కూడా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలావుంటే  మరోవైపు వచ్చే ఏడాది రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే  దర్శకుడు రాజమౌళి హీరోని లాక్ చేస్తే… ఇతర చిత్రాల్లో నటించే ఛాన్స్ ఉండదు. ఆఅందుకు రాజమౌళి మూవీ మొదలవ్వడానికి మునుపే త్రివిక్రమ్ షూట్ పూర్తి చేయాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: