రాంచరణ్ సినిమాలో నటించనున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్...!!

murali krishna
బుచ్చిబాబు సాన డైరెక్షన్‌ లో రాంచరణ్‌ సినిమా ప్రకటించాడని అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి ఇపుడు టాలీవుడ్‌లో బాగా హల్‌ చల్ చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్‌  ఉప్పెన ఫేం అయిన బుచ్చిబాబు సాన డైరెక్షన్‌ లో సినిమా ప్రకటించాడని అందరికి తెలిసిందే. భారీ స్థాయి లో రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జెట్ స్పీడు లో కొనసాగుతున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి ఇపుడు టాలీవుడ్‌ లో బాగా హల్‌ చల్ చేస్తోంది. బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌) తెలుగు సినిమా లో కనిపించాలని చాలా కాలంగా అనుకుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం అయితే లేదు.
అయితే తన టాలీవుడ్ లాంఛింగ్‌ కు రాంచరణ్‌ సినిమా అయితే చాలా బాగుంటుందని  జాన్వీకపూర్‌ భావిస్తుంది.. అంతేకాదు ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసే ప్రయత్నం లో ఫుల్‌ బిజీ బిజీగా ఉందన్న వార్త టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ గా మారింది. ఈ సినిమా తో దక్షిణాదిన గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందనే దానిపై అఫీషియల్ అప్‌డేట్ ఏం రాకున్నా.. ఈ వార్తను మాత్రం జాన్వీకపూర్ ఫాలోవర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌ లో చేస్తున్న ఆర్‌సీ 15 ప్రాజెక్ట్‌ తో ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు రాంచరణ్‌. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ మూవీ న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్‌సీ 15లో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథనాయిక గా నటిస్తుంది.
 
శ్రీకాంత్‌ ఎస్‌జే సూర్య మరియు అంజలి ఇతర నటీ నటులు కీలక పాత్రలు ను పోషిస్తు్న్నారు. ఎస్ థమన్ ఈ చిత్రాని కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్‌ రాజు అత్యంత భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: