ట్రైలర్: ఆకట్టుకుంటున్న పంచతంత్రం ట్రైలర్..!!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో పలు విభిన్నమైన సినిమాలు వస్తూనే అయితే ఇప్పుడు తాజాగా మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.నటుడు బ్రహ్మానందం ,కలర్ స్వాతి, సముద్రఖని ,రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్య దిష్ట, వికాస్ ముక్కల కీలకమైన పాత్రలో నటిస్తున్న మాంథాలజి చిత్రం పంచతంత్రం. ఈ సినిమాని డైరెక్టర్ హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉంటోంది. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన గ్రాండ్గా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ను స్టార్ హీరోయిన్ రష్మిక చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
ఇక పంచతంత్రం ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ ఐదు జంటలకు సంబంధించి కథ అన్నట్లుగా మొదట్లోనే బ్రహ్మానందం తెలియజేస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి సంతోషాలే కాదు బాధలు కూడా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటాము మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేసుకోని ముందుకు వెళ్తాము అనే కథాంశంతో తెరకెక్కించినట్లుగా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇందులో నటించిన ఐదు జంటలు ఒక్కో కథ ఒక రకంగా ఉంటోంది.

ఈ సినిమాలోని ప్రతి జంట కథ కూడా మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో ఉండే వ్యక్తులు వ్యక్తిగతలను డైరెక్టర్ హర్ష ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. మరి ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ట్రైలర్ లో కూడా ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే కనిపిస్తూ ఉన్నాయి. మరి చిత్రంతో ఇందులో ఉండే నటీనటుల కెరియర్ కూడా మారుతుందేమో చూడాలి. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: