గాడ్ ఫాదర్: సినిమాపై హాట్ కామెంట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ..!!

Divya
టాలీవుడ్ లో ప్రముఖ రచయితలలో ఒకరైన పరుచూరి బ్రదర్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఎన్నో వందల చిత్రాలకు కథలు అందించడమే కాకుండా డైలాగులు కూడా అందించి ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను అందించారు. ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ పలు సినిమాల పైన తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ చిత్రమైన ఫ్లాప్ అయ్యిందంటే ఎందుకు ఫ్లాప్ అయిందనే విషయాన్ని తెలియజేయడంతో పాటు హిట్ అయిన సినిమా ఏ అంశాలు ప్రధానంగా పోషించడం వల్ల హిట్ అయిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు.

అలా ఇప్పుడు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా పైన పలు సంచలనాత్మకంగా స్పందించారు ఈ చిత్రం ఎందుకు ఆకట్టుకోలేకపోయింది ఏ అంశాలు ఈ సినిమాకి మైనస్ గా మారాయి కూడా తెలియజేశారు. మలయాళం లో ఈ చిత్రాన్ని లూసీఫర్ పేరుతో తేరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి కథను పలు రకాలుగా చేంజ్ చేసి గాడ్ ఫాదర్ గా విడుదల చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఈ చిత్రంలోని మార్పులు చేయడం బాగుంది..కానీ ఇలాంటి స్లో పేస్ సినిమాలు చిరంజీవికి పెద్దగా వర్కౌట్ కావు అని తెలియజేశారు. ముఖ్యంగా చిరంజీవి బాడి లాంగ్వేజ్కు ఇలాంటివి సెట్ కావు అని తెలియజేశారు.
కథలు చిన్న చిన్న మార్పులు చేసి లూసీఫర్ కథని తీసుకువచ్చారు. కథలో తెలుగుదనం కనిపించడం కోసం చిత్ర బృందం పలు చర్యలు తీసుకున్నారు.. అందుచేతనే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఒక కర్ణుడి కథ తన చెల్లెలకు దూరంగా ఉండే ఆన్నయ్య వారిని ఎలా కాపాడుకోవాలో వాళ్ల ప్రేమను ఎలా పొందగలిగాడు అన్న కథాంశంతో తెరకెక్కించారు.ఈ చిత్రంలో నయనతార పాత్ర అద్భుతంగా ఉంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే తో బాగానే ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో మంచి స్క్రీన్ ప్లే ఉంది. ఈ చిత్రంలో ప్లస్ సల్మాన్ ఖాన్ మైనస్ కూడా ఆయనే అని తెలియజేశారు. ముఖ్యంగా చిరంజీవికి బాడీగార్డ్ గా సల్మాన్ ఖాన్ అదరగొట్టారు. అయితే చిరంజీవి ఫ్రేమ్ లో ఉండగా సల్మాన్ ఖాన్ ఫైట్ చేయడంతో అభిమానులకు నచ్చలేదని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: