అజిత్ తునివు మూవీ నుంచీ బిగ్ అప్డేట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!

Divya
కోలీవుడ్ హీరోలు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్ అందరికంటే ముందు వరుసలో ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. అయితే కోలీవుడ్ హీరోలు మాత్రం కేవలం దక్షిణాది సినిమాల్లోనే తమ సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో అతిపెద్ద పండుగ సీజన్ ఏదైనా ఉంది అంటే అది కేవలం సంక్రాంతి సీజన్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ చాలా పెద్దది. తమ సినిమాలను బరిలో దింపేందుకు టాలీవుడ్ హీరోలు సిద్ధమవుతూ ఉంటారు. అలాగే అదే సమయంలో పక్క ఇండస్ట్రీల వారు కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తారు.
ఈ క్రమంలోనే రాబోతున్న సంక్రాంతి పండుగకు కోలీవుడ్ నుంచి  రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  అందులో ఒకటి విజయ్ దళపతి నటించిన "వారిసు" చిత్రం కాగా .. మరొకటి అజిత్ కుమార్ నటించిన "తునివు". కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా అవతరించిన అజిత్ సినిమా వస్తోందంటే అక్కడ కటౌట్లు మామూలుగా ఉండవు.. అంచనాలకు మించి ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. వలిమై దర్శకుడు వీహెచ్ వినోద్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను ఓవర్సీస్ బిజినెస్ హక్కులను బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకోగా..RRR, KGF-2 సినిమాలకు USA లో  డిస్ట్రిబ్యూటర్ గా  వ్యవహరించిన "Saregame" సినిమాస్  వారు అజిత్ యొక్క తునివుని డిస్ట్రిబ్యూటింగ్ హక్కులను కైవసం చేసుకుంది.
అంతేకాదు జనవరి 12వ తేదీన సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.  కేవలం సౌత్ ఇండియన్ భాషల్లోని ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి. మొత్తానికి అయితే ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: