వెన్నెల కిషోర్ పై మంచు విష్ణు ఫైర్..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ఇప్పుడు వెన్నెల కిషోర్ మంచు విష్ణు ట్రాక్ గత కొన్ని రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే జిన్నా ప్రమోషన్స్‌లో భాగంగా వెన్నెల కిషోర్‌ను మంచు విష్ణు బాగానే వాడేశాడు. వెన్నెల కిషోర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు మంచు విష్ణు.ఇక  పొగరు, బలుపు, యారగెన్స్ ఇలా నానా రకాలుగా తిట్టేశాడు. అయితే నాకు ఇష్టమైన నటుడు అంటూ పొగుడుతూనే స్టేజ్ మీద వెన్నెల కిషోర్‌ను ఎన్ని అనాలో అన్నీ అనేశాడు మంచు విష్ణు.ఇక ఇలా వెన్నెల కిషోర్, మంచు విష్ణు కామెడీని జనాలు కూడా సోషల్ మీడియాలో

 ఎంజాయ్ చేస్తుంటారు. ఇక జిన్నా సినిమాలో మంచు విష్ణు వెన్నెల కిషోర్ చమ్మక్ చంద్ర ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. సెకండాఫ్ మొత్తం కూడా ఈ ముగ్గురిదే హవా.అయితే  అందులోనూ చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అయితే జనాలను తెగ నవ్వించేస్తుంటుంది. జిన్నా సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది.  ఇక అది వేరే విషయమనుకోండి. కానీ వెన్నెల కిషోర్‌ను మాత్రం విష్ణు ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు.ఇకపోతే నిన్న మంచు విష్ణు బర్త్ డే. మంచు లక్ష్మీ, మనోజ్ ఇలా అందరూ కూడా విష్ణుకి విషెస్ అందించారు.ఇక  జంబలకిడి జారుమిఠాయా

 అనే పాట పాడించి మరి మనోజ్ తన అన్నకి విషెస్ చెప్పాడు. మంచు లక్ష్మీ సైతం తన స్టైల్లో విషెస్ చెప్పింది. వెన్నెల కిషోర్ కూడా ట్వీట్ వేశాడు.ఇక  మన డైనమిక్ హీరో మంచు విష్ణు గారికి హ్యాపీ బర్త్ డే.. సర్ జీ మీరు ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని విషెస్ అందించాడు.ఇక తాజాగా మంచు విష్ణు స్పందించాడు. థాంక్యూ గానీ.. కాస్త ముందుగా విష్ చేయలేవా? ఇంత లేటుగానా?.. సో మంచ్ యారోగెన్స్ అంటూ కౌంటర్ వేశాడు. ఈ ట్వీట్ మీద జనాలు రకరకాలుగా స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు.దింతో నీకు విష్ చేయడమే ఎక్కువ.. ఇంకా త్వరగా విష్ చేయవా? అని అడుగుతున్నావా? అంటూ నెటిజన్లు పరువుతీస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: