"వాల్తేరు వీరయ్య" మూవీ బాస్ పార్టీ సాంగ్ లొకేషన్ లను షేర్ చేసిన చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్  ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. బాబి సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా , మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
 

రవితేజ ఈ మూవీ లో 45 నిమిషాల నిడివి గల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి , రవితేజ మధ్య కొన్ని యాక్షన్స్ సన్నివేషాలు మరియు ఒక సాంగ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రోటేలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది.
 

ఈ మూవీ ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టైటిల్ టీజర్ ను విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు వాల్తేరు వీరయ్య మూవీ నుండి బాస్ పార్టీ అనే లిరికల్ సాంగ్ ను మూవీ యూనిట్ విడుదల చేయబోతోంది. నిన్న ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ ప్రోమో వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "బాస్ పార్టీ" సాంగ్ కు సంబంధించిన లొకేషన్ లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ చేసిన ప్రొడక్షన్ డిజైన్ సెట్ వర్క్ మమ్మల్ని చాలా అందరినీ ఆకట్టుకుంది. మీ ప్రశంసలు కూడా అతనికి దక్కుతాయని ఆశిస్తూ ...  రెడీగా ఉండండి ... రేపు పార్టీ స్టార్ట్ అవుతుంది అని చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: