"ఏన్ సి 22" టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే అనేక మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య , వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో కృతి శెట్టి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు మూవీ తెరకెక్కింది. ఈ సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ సినిమా. ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా పొందుతున్న నేపథ్యంలో ఎన్ సి 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది.
 

ఈ మూవీ కి ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను  నవంబర్ 23 వ తేదీన ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: