ఆమె ఒంటరిగా బాలీవుడ్ ను కాపాడుతుంది... కంగనా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి టబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టబు ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన టబు కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటించి తన అంద చందాలతో , నటన తో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తెలుగు లో చాలా తక్కువ శాతం సినిమాల్లోనే నటిస్తోంది. కాకపోతే హిందీ లో మాత్రం వరస మూవీ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ హిందీ లో నటించిన సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో సరైన విజయాలు పడడం లేదు అన్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే టబు ఈ మధ్య నటించిన బుల్ బుల్లయ్య 2 మరియు దృశ్యం 2 మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా టటు నటించిన రెండు సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలంగా ఇండస్ట్రీ లో సరైన హిట్  లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ కు సక్సెస్ మూవీ లు ఇచ్చిన టబు ను బీటం కాంట్రవర్సీ బ్యూటీ కంగనా పొగడ్తలతో ముంచెత్తింది. టబు నటించిన రెండు మూవీ లు వరుసగా మంచి విజయాలను సాధించాయి. దీనితో టబు ఒంటి చేత్తో బాలీవుడ్ పరిశ్రమలు కాపాడింది అని కంగనా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: