మహేష్ బాబును వదిలి నరేష్ ఇంటిలోనే కృష్ణ ఎందుకు ఉన్నట్టు.. అసలు కారణం ఏంటి..!?

Anilkumar
సూపర్ స్టార్ కృష్ణ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీని విషాదం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన చనిపోయి వారం రోజులు గడుస్తున్నా..ఇంకా ఆయనతో గడిపిన క్షణాలు, ఇతర విషయాలు తోటి నటులు, కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు.  కృష్ణ ఫ్యాన్స్ ఇప్పటికీ ఆయన గురించి పలు విషయాలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.ఇదిలావుంటే  తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇక  అదేంటంటే.. కృష్ణకు మహేశ్ బాబు కంటే నరేశ్ పై ఎక్కువ ప్రేమ ఉండేదట.

ఇకపోతే కృష్ణ సినీ ఇండస్ట్రీకి రాకముందు ఇందిరను పెళ్లి చేసుకున్నాడు.ఇక  అప్పటికే అంటే 1965 అక్టోబర్ 13 నాటికి రమేష్ వారికి జన్మించారు. అయితే వీరికి మొత్తం ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.కావ  పెద్ద కొడుకు రమేష్ ఈ ఏడాది జనవరి 8న మరణించాడు. ఇక చిన్న కొడుకు మహేష్ సినిమాల్లో కొనసాగుతున్నాడు. కుమార్తెల్లో పద్మజ, ప్రియదర్శిని, మంజులలు ఉన్నారు.అయితే  వీరిలో మంజుల సినీ ఫీల్డులో కొనసాగుతున్నారు. ఇకపోతే పద్మిని భర్త సుధీర్ బాబు సినీ హీరో. ప్రియదర్శిని భర్త గల్లా జయదేవ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

అయితే 'సాక్షి' సినిమా చేసే సమయంలో కృష్ణ, విజయనిర్మల ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే విజయ నిర్మల, ఇతర వ్యక్తికి నరేష్ జన్మించాడు. ఇక విజయ నిర్మల ఆ వ్యక్తితో విడాకులు తీసుకొని నరేష్ తో పాటు కృష్ణ దగ్గరే ఉంటూ వచ్చింది.కాగా కృష్ణ సినిమాలు తగ్గినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఆయన అవసరాలను మాత్రం విజయనిర్మల దగ్గరుండి చూసకునేది. అయితే ఈ క్రమంలో నరేష్ కూడా కృష్ణకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేవారు.ఇకపోతే 2019లో విజయనిర్మల మరణం తరువాత కృష్ణ తీవ్ర దు:ఖంలోకి వెళ్లారు. ఇదే సమయంలో నరేష్ కృష్ణ వెంటే ఉంటూ విజయనిర్మల లేని లోటును తీర్చాడు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా పిలవగానే వచ్చేవారు. ఇక అలా కృష్ణ మరణించేవరకు నరేష్ తన బాగోగులు చూసుకున్నందున కృష్ణకు నరేష్ అంటే ఎంతో అభిమానం అని చర్చించుకుంటున్నారు.అయితే  ఈ క్రమంలో కృష్ణ చివరిసారిగా గడిపిన నివాసాన్ని మహేష్ నరేష్ కే ఇచ్చినట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: