టీజర్: హనుమాన్ టీజర్ సూపర్ హీరో వచ్చేసాడుగా..!!

Divya
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హనుమాన్. కెరియర్ ప్రారంభం నుంచి ఎన్నో విభిన్నమైన సినిమాలతో దర్శకుడు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తాజాగా సూపర్ హీరో సినిమా రూపొందించడానికి ప్రశాంత్ వర్మ ఒక సినిమాటిక్ యూనివర్సిటీ సృష్టించాడు. జాంబిరెడ్డి వంటి సినిమా హిట్ తర్వాత హనుమాన్ మల్టీ స్టార్లర్ భాగంగా వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. దీంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ ,ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా టీజర్స్ ని మేకర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ టీజర్ విషయానికి వస్తే మొదట ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ని చూపిస్తూ చేతిలో గదతో నిలబడి ఉన్న ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని చూపించడంతో ఈ సినిమా టీజర్ ప్రారంభమవుతుంది. బ్యాగ్రౌండ్ లో ఒక భక్తి పారవేశాన్ని కలిగిస్తూ రాముడి పరమ భక్తుడైన హనుమంతుడిని గుర్తించిన కీర్తనను మనం వినవచ్చు .. తేజా సజ్జా సముద్రపు ఒడ్డున అపస్మారక స్థితిలో పడి ఉంటారు.

ఇందులో హీరోయిన్గా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నది. ఇక ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కొబ్బరికాయలతో విలన్ లపై ఫైట్ చేస్తూ ఉండేటువంటి విషయాన్ని కూడా గమనించవచ్చు. సాధారణ యువకుడైన హనుమంతు కొన్ని అతిద శక్తులతో సూపర్ హీరోగా మారినట్లు ఈ సినిమాలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా హనుమంతునిగా ఆకాశంలో ఎగురుతూ ఉండే కొన్ని విన్యాసాలను కూడా మనం చూడవచ్చు. ఇక డైరెక్టర్ ప్రశాంతవర్మ మరొకసారి ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచే సినిమాతో రాబోతున్నట్లు ఈ టీజర్ ని చూపించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: