ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి ఈ సంవత్సరం మొదటగా ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సంవత్సరం గాడ్ ఫాదర్. మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించాడు. మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మూవీ లో అతిథి పాత్రలో నటించాడు. సత్య దేవ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా , లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు నుండి అనగా నవంబర్ 19 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఎవరైనా గాడ్ ఫాదర్ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా నవంబర్ 19 వ తేదీ నుండి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: